దొండకాయ పచ్చడి - Dondakaya Pachadi

 దొండకాయ పచ్చడి:

కావలసిన వస్తువులు:

దొండకాయలు - 1/2 కిలో

ఎండుమిర్చీ - 25గ్రా||

చింతపండు - నిమ్మకాయంత

పసుపు - చిటికెడు

ఉప్పు - సరిపడినంత

మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, చిన్న ఇంగువ ముక్క - కొంచెం


తయారు చేసే విధానం:

కొంచెం నూనెలో మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేయించి వుంచుకోవాలి. దొండకాయల్ని అడ్డంగా రెండేసి ముక్కలుగా తరిగి రోట్లో వేసి కచ్చామచ్చాగా దంచి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించిన పప్పులూ, ఎండుమిర్చీ ఇంగువా మెత్తగా నూరుకోవాలి. అందులో దొండతొక్కు కలిపి మరింత మెత్తగ నూరాలి. ఇప్పుడు మిగిలిన నూనెనుకాచి ఆవాలు, జీలకర్రా వేయించి ఆ మొత్తం దొండకాయపచ్చడిలో వేసి కలిపాలి. ఇప్పుడు దొండకాయ పచ్చడి రెడీ.




Ads by PSPLAY.IN

Random Posts

Loading posts...
Link copied