బీరకాయ పెసరపప్పు కూర - Beerakaya Pesarapappu Curry

 బీరకాయ పెసరపప్పు కూర:

కావలసిన పదార్థాలు :

బీరకాయ ముక్కలు - 500 గ్రా.

పెసరపప్పు - 100 గ్రా

ఉల్లిపాయ - 1

కరివేపాకు -2 రెబ్బలు

పసుపు - 1/4 టీ.స్పూ.

కారం పొడి - 1 టీ.స్పూ.

గరం మాసాలా పొడి - 1/4 టీ.స్పూ.

అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ.స్పూ.

ఉప్పు - తగినంత

నూనె - 3 టీ.స్పూ.


తయారుచేసే పద్ధతి :

పెసరపప్పు కడిగి నీళ్లుపోసి గంటసేపు నాననివ్వాలి.

బీరకాయ చెక్కు తీసి చేదు చూసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

పాన్లో నూనె వేడి చేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో కరివేపాకు, పసుపు, కారం పొడి, అల్లం వెల్లుల్లి వేసి రెండు నిమిషాలు వేపాక నానిన పెసరపప్పు వేయాలి. బాగా కలిపి నీరంతా పోయేవరకు వేయించాలి. తర్వాత బీరకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. చిన్న మంటమీద ముక్కలు మగ్గిన తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. చివరగా గరం మసాలా పొడి కలిపి దింపేయాలి. ఈ కూర చపాతీ, అన్నంలోకి బావుంటుంది. కూరగాయలు అ చ్చంగా అలాగే కాకుండా అప్పుడప్పుడు పప్పులు కూడా కలిపితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.






Ads by PSPLAY.IN

Random Posts

Loading posts...
Link copied