దొండకాయ వేపుడు / Dondakaya Fry

 దొండకాయ వేపుడు:

కావలసిన వస్తువులు:

దొండకాయలు - పావు కిలో

కారం - తగినంత

ఉప్పు - తగినంత

నూనె - వేయించడానికి సరిపడినంత

ఉల్లిపాయలు - 2


తయారు చేసే విధానం:

దొండకాయలు నీటిలో కడిగి సన్నగా పొడవుగా కాని, చక్రాల్లా కాని తరగాలి. కళాయిలో నూనె వేసి స్టవ్‌మీద పెట్టి కాగాక దొండకాయ ముక్కలు వేసి తక్కువ మంటమీద వేయించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ముక్కలు మెత్తబడ్డ తరువాత నూనె వంపేసి కారం, ఉప్పు వేసి కలిపి దించాలి. ఉల్లిపాయలు ఇష్టపడే వారు దొండకాయ ముక్కలు వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగిన తరువాత కారం ఉప్పు కలుపుకోవాలి.




Ads by PSPLAY.IN

Random Posts

Loading posts...
Link copied