టొమాటో వడియాలు - Tomato vadiyalu

 టొమాటో వడియాలు:

కావలసిన వస్తువులు :

ఎర్రని టొమాటోలు: అరకిలో

బియ్యప్పిండి: కిలో,

ఉప్పు: 8 టీస్పూన్లు,

కారం: 5 టీస్పూన్లు,

జీలకర్ర: 5 టీస్పూన్లు.


తయారు చేసే విధానం :

టొమాటోలు కడిగి ముక్కలు చేసి, మిక్సీలో గుజ్జులా చేయాలి. ఇందులో నాలుగైదు గ్లాసుల నీళ్లు పోసి వడగట్టాలి. ఇప్పుడు వడగట్టిన టొమాటో రసంలో కారం, ఉప్పు, జీలకర్ర వేసి మరిగించాలి. బియ్యప్పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. తరవాత మరుగుతోన్న టొమాటో రసాన్ని గరిటెతో తీసి, పిండిలో పోసి జారుగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిగిలిన రసంలో పోసి ఉడికించాలి. పచ్చి వాసన పోయి మిశ్రమం కాస్త చిక్కబడేవరకూ ఉడికించి దించాలి. ఇప్పుడు దీన్ని తడిబట్టమీద గరిటెతో వడియాల్లా పెట్టాలి. వీటిని గలగలలాడేవరకూ ఎండనివ్వాలి.



Ads by PSPLAY.IN

Random Posts

Loading posts...
Link copied