రొయ్యల చిగురు - Royyala Chiguru

 రొయ్యల చిగురు:

కావలసిన పదార్థాలు :

చింతచిగురు - కప్పు

రొయ్యలు - పావుకిలో

వెల్లుల్లి తురుము - టేబుల్ స్పూన్

ఉల్లిపాయల ముక్కలు - అరకప్పు

ఉప్పు - తగినంత

పసుపు - పావుటీస్పూన్

వెన్న - 2 టేబుల్ స్పూన్లు

కారం - 2 టీస్పూన్లు


తయారుచేసే పద్ధతి :

నాన్ స్టిక్ పాన్ లో కాస్త వెన్న వేసి కాగాక, రొయ్యలు, కాస్త ఉప్పు, కారం వేసి వేయించాలి. నీళ్లన్నీ ఇగిరి రొయ్యలు వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి.

అదే పాన్ లో మిగిలిన వెన్న వేసి వెల్లుల్లి తురుము, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. తరువాత మిగిలిన కారం, ధనియాల పొడి రొయ్యలు వేసి కలపాలి. ఇప్పుడు సన్నగా తరిగిన చింతచిగురు వేసి తక్కువ మంట మీద ఉడికించాలి.

అవసరమైతే మరికొంత ఉప్పును, కాసిని నీళ్ళు చిలకరించి చిగురు పూర్తిగా రొయ్యలకూ పట్టే వరకు ఉడికించి దించాలి. ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు.




Ads by PSPLAY.IN

Random Posts

Loading posts...
Link copied