మటన్ పచ్చడి - Mutton Pachadi

 మటన్ పచ్చడి:

కావలసిన పదార్థాలు :

బోన్ లెస్ మటన్ : కిలో

అల్లం,వెల్లుల్లి పేస్ట్ : ఒక టేబుల్ స్పూన్

కారం : అరకప్పు

ఉప్పు : ఒక టేబుల్ స్పూన్

లవంగాల పొడి : అర చెంచ

నూనె : అరకిలో

నిమ్మకాయ : 1


తయారుచేసే పద్ధతి :

మటన్ ముక్కలు కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బట్ట మీద వేసి కాసేపు ఆరనివ్వాలి. మూకుడులో నూనె(డీప్ ఫ్రైకి సరిపడా) వేడి చేసుకొని మటన్ ముక్కలు వేయించుకోవాలి. మటన్ ముక్క ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ముక్క ఉడికింది లేనిది చూసుకొని, నూనెలో నుంచి చిల్లుల గరిటెతో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ ఆర్పివేయాలి. మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసేయాలి. స్టవ్ తక్కువ మంట మీద పెట్టుకొని ఆ మూకుడు పెట్టి, అందులో నూరిన అల్లం, వెల్లుల్లి ముద్ద,లవంగాల పొడి, కారం, ఉప్పు వేసుకోవాలి. స్టవ్ ఆర్పివేసి గిన్నెలోకి తీసుకున్న మటన్ ముక్కలను వేసి అన్ని ముక్కలకు కారం పట్టేలా కలపాలి. వేడి తగ్గిన తరువాత నిమ్మకాయరసం పిండాలి.




Ads by PSPLAY.IN

Random Posts

Loading posts...
Link copied