మటన్ చిల్లి ప్రై - Mutton chilli fry

 మటన్ చిల్లి ప్రై:

కావలసిన వస్తువులు :

మటన్ (బోన్స్ తో సహా): అరకిలో,

పండుమిర్చి: 8,

జీలకర్ర: 2 టీ స్పూన్లు

గరం మసాల: టీ స్పూను,

ఉల్లిపాయలు: 2,

నూనె: నాలుగు టేబుల్ స్పూన్లు

చింతపండు: నిమ్మకాయంత,

కరివేపాకు: కట్ట,

కొత్తిమీర: కట్ట

అల్లం వెల్లుల్లి: 2 టేబుల్ స్పూన్లు,

ఉప్పు: తగినంత


తయారు చేసే విధానం :

మటన్ ముక్కల్ని కడగాలి. కాస్త ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరవాత కాస్త అల్లం వెల్లుల్లి పట్టించి 15 నిమిషాలు ఉడికించాలి. పండుమిర్చి, జీల కర్ర, గరం మసాల కలిపి మెత్తగా రుబ్బి ఉంచాలి. ఓ బాణలి లో నునె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించాలి. మిగిలిన అల్లం వెల్లుల్లి ముద్ద, నూరిన మసాల వేసి బాగా వేయించాలి. అందులోనే మటన్ ముక్కలు వేసి చింతపండు రసం కూడా పిండాలి. ముక్క బాగా ఉడికి నీరంతా ఆవిరై పోయాక కరివేపాకు, కొట్టి మీరా వేసి సరి చూసి దించాలి.




Ads by PSPLAY.IN

Random Posts

Loading posts...
Link copied