గుమ్మడి పప్పు - Gummadi Pappu

 గుమ్మడి పప్పు:

కావలసిన వస్తువులు:

గుమ్మడి ముక్కలు - ఒక కప్పు

బంగళాదుంపలు - రెండు చిన్న ముక్కలు

ఉల్లిగడ్డ - ఒకటి

పచ్చిమిరపకాయలు - రెండు

గరంమసాలా - ఒక చెంచా

పచ్చికొబ్బరి పొడి - ఒక చెంచా

పుదీనా, కొత్తిమీర, కరివేపాకు - తగినంత

నూనె, మీగడ - ఒక చెంచా

కారం, ఉప్పు - రుచికి తగినట్టు

టమాటాలు - రెండు


తయారు చేసే విధానం:

ముందుగా కందిపప్పు, దుంపలు ఉడికించాలి. గుమ్మడి ముక్కలు సన్నగా తరగాలి. ఒక గిన్నెలో నూనెపోసి వేడిచేసి తాలింపు చేయాలి. దీంట్లో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. పుదీనా, కరివేపాకు, దుంపలు, గుమ్మడి ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తరువాత గరం మసాలా, ఉప్పు, కారం, టమటా వేసి కొంచెం నీరు పైనుండి చిలకరించి ఒక పదినిముషాల సేపు మూతపెట్టి ఉడకనివ్వాలి. తరువాత దించి డిష్‌లోకి తీసుకుని పై నుండి కొత్తిమీర, మీగడ, కొబ్బరి చల్లాల.




Ads by PSPLAY.IN

Random Posts

Loading posts...
Link copied