జింజర్ ప్రాన్స్ - ginger prawns

 జింజర్ ప్రాన్స్:

కావలసిన పదార్థాలు:

ప్రాన్స్ : 200గ్రా

ఉల్లిపాయ పేస్ట్ : ఒక కప్పు

అల్లంవెల్లుల్లి పేస్ట్ : అర కప్పు

అజినమోటో : టి స్పూన్

ఉప్పు : తగినంత

మిరియాల పొడి : టీ స్పూన్

కారం : రెండు టీ స్పూన్లు

నూనె : డీప్ ఫ్రైకి సరిపడా

టొమాటో సాస్ : టీ స్పూన్

సోయా సాస్ : టీ స్పూన్

ఫుడ్ (రెడ్) కలర్ : చిటికెడు

కొత్తిమీర తరుగు : రెండు టీ స్పూన్లు


తయారుచేసే పద్ధతి :

ముందుగా ప్రాన్స్‌ని శుభ్రం చేసి వేడినీటిలో కాస్త ఉడి కించి పక్కనపెట్టుకోవాలి. పాన్‌లో అరకప్పు నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ పేస్ట్‌, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, అజిన మోటో, మిరియాలపొడి, కారం, ఉప్పు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత గ్లాస్‌ నీరు పోసి ఉడి కించాలి. మిశ్రమం దగ్గర పడేటప్పుడు టొమాటో సాస్‌, సోయా సాస్‌, ఫుడ్‌ కలర్‌ వేసి కలపాలి. ఇందులో ఉడి కించిన రొయ్యలను కలిపి నూనెలో డీప్‌ ఫ్రై చేయాలి. దోరగా వేయించిన జింజర్‌ ప్రాన్స్‌ను సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్‌ చేయాలి.




Ads by PSPLAY.IN

Random Posts

Loading posts...
Link copied