దోసకాయ కూర - Dosakaya Kura

 దోసకాయ కూర:

కావలసిన పదార్థాలు :

దోసకాయలు - 250 గ్రా.

టమోటాలు - 100 గ్రా.

ఉల్లిపాయలు - 100 గ్రా.

అల్లం - చిన్న ముక్క

నూనె - 150 గ్రా.

ఆవాలు - ఒక స్పూన్

జీలకర్ర - ఒక స్పూన్

కరివేపాకు - కొంచెం

పసుపు - ఒక స్పూన్

కారం పొడి - ఒకటిన్నర స్పూన్

ఉప్పు - తగినంత


తయారుచేసే పద్ధతి :

మొదట దోసకాయలను, ఉల్లిపాయలను , టొమాటలను, అల్లంను ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.

తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడించుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత దోసకాయ, అల్లం ముక్కలను వేసి ఐదు నిముషాలు ఉడకనివ్వాలి. అనంతరం టమాటో ముక్కలు, తగినంత ఉప్పు, కారం పొడి, పసుపు వేసి ఐదు నిముషాలు నూనెలోనే ఉడకనివ్వాలి. చివరిగా కొంచెం నీటిని చేర్చి మరో రెండు నిముషాలు ఉడకనివ్వాలి. అంతే దోసకాయ కూర రెడీ.



Ads by PSPLAY.IN

Random Posts

Loading posts...
Link copied