చికెన్ కర్రీ - Chicken Curry

 చికెన్ కర్రీ:

కావలసిన పదార్థాలు :

చికెన్ ముక్కలు - ఒక కిలో

కొబ్బరి పాలు - రెండు కప్పులు

కొబ్బరి ముద్ద - 2 టేబుల్ స్పూన్లు

ఉల్లిపాయ - ఒకటి

నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు

వెల్లుల్లి - 2 రెబ్బలు

ఎండుమిర్చి - 4

పచ్చిమిర్చి - 4

కారం - 2 టీస్పూన్లు

ఉప్పు - సరిపడా

పసుపు - టీస్పూన్

కొత్తిమీర తురుము - టేబుల్ స్పూన్

నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు


తయారుచేసే పద్ధతి :

పాన్ లో నెయ్యి వేసి వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, కొత్తిమీర తురుము వేసి వేయించాలి. చికెన్ ముక్కలు కూడా వేసి కొబ్బరి పాలు పోసి మరిగించాలి.

తరువాత మంట తగ్గించి ఉప్పు, కారం వేసి కలిపి మూత పెట్టి సుమారు 45 నిమిషాల సేపు ఉడికించాలి. ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కొబ్బరి ముద్ద, నిమ్మరసం వేసి మూత పెట్టి ఐదు నిముషాలు ఉడికించాలి.




Ads by PSPLAY.IN

Random Posts

Loading posts...
Link copied