చికెన్ క్యారెట్ కర్రీ - Chicken Carrot Curry

 చికెన్ క్యారెట్ కర్రీ:

కావలసిన పదార్థాలు :

చికెన్ ముక్కలు - పెద్ద కప్పు

క్యారెట్లు - 6(ముక్కల్లా తరగాలి)

ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి)

ఉప్పు - తగినంత

నూనె - రెండు టీస్పూన్లు

అల్లం వెల్లుల్లి పేస్ట్ - చెంచ

పసుపు - కొద్దిగా

మిరియాల పొడి - చెంచ

కొత్తిమీర తరుగు - కొద్దిగా

గరం మసాలా - చెంచ


తయారుచేసే పద్ధతి :

బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిరియాల పొడి, చికెన్ ముక్కలు వేసి, రెండు కప్పుల నీళ్ళు పోసి మూత పెట్టాలి. ఐదు నిమిషాలయ్యాక క్యారెట్ ముక్కలు, తగినంత ఉప్పు, గరం మసాలా వేసి మళ్ళీ మూత పెట్టాలి. ఇరవై ఐదు నిమిషాలకు అన్నీ ఉడుకుతాయి. పైన కొత్తిమీర చల్లి వడ్డించాలి.




Ads by PSPLAY.IN

Random Posts

Loading posts...
Link copied