భేల్ పూరి - Bhel Puri

 బేల్ పూరి:

కావలసిన పదార్థాలు:

మరమరాలు - 100 గ్రాములు,

టమాటాలు - 10 గ్రాములు,

ఉల్లిగడ్డ - 1,

కొత్తిమీర - 1 కట్ట,

కట్టామీటా చట్నీ - టేబుల్‌ స్పూన్‌,

కారం - 3 గ్రాములు,

చాట్‌ మసాలా - 3 గ్రాములు,

నిమ్మరసం - 2 టేబుల్‌ స్పూన్లు,

సేవ్‌ - 20 గ్రాములు

ఉప్పు - తగినంత


తయారీ విధానం:

ఉల్లిగడ్డ, టమాట, పచ్చిమిర్చి బాగా సన్నగా తరగాలి.

ఓ గిన్నెలో కట్టామీటా చట్నీ, ఉప్పు, కారం, చాట్‌మసాలా కలపాలి.

అందులోనే మరమరాలు, తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలిసేటట్టు తిప్పాలి.

చివర్లో సేవ్‌, కొత్తిమీర తరుగు చల్లుకుంటే చాలు.



Ads by PSPLAY.IN

Random Posts

Loading posts...
Link copied