బెండకాయ పెరుగు - Bendakaya perugu

 బెండకాయ పెరుగు:

కావలసిన పదార్థాలు :

బెండకాయలు - 40ఱగా.

పెరుగు - 1 1/2 కప్పు

పచ్చిమిరపకాయలు - 3

అల్లం - చిన్న ముక్క

మిరియాలు - అర టీ స్పూన్

శనగపిండి - ఒక స్పూన్

ఎండు మిరపకాయలు - 2

జీలకర్ర - ఒక టీ స్పూన్

ధనియాలపొడి - ఒక స్పూన్

పసుపు - పావు టీ స్పూన్

కొత్తిమీర - అర కట్ట

ఉప్పు, నూనె - తగినంత


తయారు చేసే విధానం :

బెండకాయలను కడిగి చిన్నముక్కలుగా కట్ చేసి ఎండబెట్టాలి. అల్లం, మిరియాలను పేస్ట్ చేయాలి. శనగపిండిని కొంచెం వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె పోసి ఎండుమిరకాయలు, జీలకర్ర వేయాలి. ఇవి వేగాక, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, పసుపు, శనగపిండి వేసి బాగా కలపాలి. తర్వాత బెండకాయలను వేసి సన్నని మంట మీద వేగనివ్వాలి. పావుగంట తర్వాత అల్లం, మిరియాల పేస్ట్, పెరుగు పోసి మరోసారి కలపాలి. ఇలా పదినిమిషాలపాటు ఉంచాలి. చివరగా కొత్తిమీర వేసి దించేస్తే సరి.




Ads by PSPLAY.IN

Random Posts

Loading posts...
Link copied