బీరకాయ పచ్చడి - Beerakaya Curry

 బీరకాయ పచ్చడి:

కావలసిన వస్తువులు:

బీరకాయలు - పావుకిలో

పచ్చిమిర్చి - 100 గ్రా||

చింతపండు - నిమ్మకాయంత

నూనె - 25గ్రా||

ఉప్పు - 25గ్రా||

జీలకర్ర - పావు చెంచా

వెల్లుల్లిరేకలు - 4


తయారు చేసే విధానం:

బీరకాయలపై పెచ్చులు తీసేసి కడిగి ముక్కలు చేయాలి. పచ్చిమిర్చి ముక్కలుచేసి వేయించి తియ్యాలి. అనంతరం బీరముక్కలుకూడ వేరే వేయించి తీసుకోవాలి. మిర్చి, చింతపండు, ఉప్పు కలిపి రోట్లో బాగా నూరి అందులో బీరముక్కల్ని కూడా పడేసి పచ్చడిపచ్చడిగ నూరెయ్యడమే. చివర్లో జీలకర్ర, వెల్లుల్లిరేకలు కూడా వేసి నూరితే అదో సువాసనగా ఉంటుంది.




Ads by PSPLAY.IN

Random Posts

Loading posts...
Link copied